: ‘హ్యాపీ బర్త్ డే’ పాట ఎవరైనా పాడుకోవచ్చు: ఫెడరల్ జడ్జి


‘హ్యాపీ బర్త్ డే’ పాట పాడుకోవచ్చు.. బహిరంగ ప్రదేశాలలో ఈ ట్యూన్ ను నిరాటంకంగా వాడుకోవచ్చు.. ప్రజలకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవంటూ లాస్ ఏంజిల్స్ లోని ఒక ఫెడరల్ జడ్జి తీర్పు నిచ్చారు. హ్యాపీ బర్త్ డే ట్యూన్ తమదేనంటూ రెండేళ్ల క్రితం కోర్టుకెక్కిన వార్నర్ మ్యూజిక్ కు చుక్కెదురైంది. హ్యాపీ బర్త్ డే పాటకు సంబంధించి వార్నర్ చాపెల్ మ్యూజిక్ కు సొంతంగా ఎటువంటి కాపీరైట్ కల్గి ఉండలేదని జడ్జి జార్జి కింగ్ తేల్చి చెప్పారు. కాగా, గతంలో ఒక మ్యుజీషియన్, ఫిల్మ్ మేకర్ కలిసి ఒక చిత్రం నిర్మించాలనుకున్నారు. ఆ చిత్రంలో ‘హ్యాపీ బర్త్ డే’ ట్యూన్లు వాడుకోవాలనుకున్నారు. అయితే, తనకు 1,500 డాలర్లు చెల్లించాలంటూ వార్నర్ డిమాండ్ చేశాడు. అందుకు వారిద్దరూ అంగీకరించలేదు. ఆ పాటను 19వ సెంచరీలో రాశారని, దానిపై ఎటువంటి కాపీరైట్ లేకపోవడం వల్ల ప్రజలు ఆ పాటను, ట్యూన్ ను ఉపయోగించుకోవచ్చని వారు వాదించారు. వార్నర్ వాదన మాత్రం మరోలా ఉంది. 1935లో ఈ పాటకు లీగల్ కాపీరైట్ లభించిందని అన్నారు. దీంతో ఈ కేసు కోర్టు కెక్కింది.

  • Loading...

More Telugu News