: సీఎం కనుసన్నల్లోనే బూటకపు ఎన్ కౌంటర్: మధుయాష్కి
వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మండిపడ్డారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ బూటకపు ఎన్ కౌంటర్ జరిగిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సర్కారును ప్రశ్నించే సాహసం ఎవరూ చేయకూడదనే లక్ష్యంతోనే, ఈ బూటకపు ఎన్ కౌంటర్ ను చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ఇద్దరు ముద్దుబిడ్డలను అన్యాయంగా చంపేశారని మండిపడ్డారు. మావోయిస్టుల అజెండానే తమ అజెండా అని చెప్పుకున్న కేసీఆర్... ఇప్పుడు మాట తప్పి, వారినే బలిగొంటున్నారని విమర్శించారు. వర్షాలు కురవక పోయినా కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అనే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.