: కలెక్టర్లు, ఎస్పీల సమక్షంలో తెలంగాణలో మద్యం లాటరీలు ప్రారంభం


తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సోమవారం దాకా టెండర్లు స్వీకరించిన అధికార యంత్రాంగం కొద్దిసేపటి క్రితం టెండర్ బాక్సులను ఓపెన్ చేసింది. ఒకే షాపునకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన షాపుల కేటాయింపునకు లాటరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బిడ్లు దాఖలైన అన్ని షాపులకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లాటరీలు నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమక్షంలో ఎక్సైజ్ శాఖాధికారులు లాటరీలు నిర్వహిస్తున్నారు. లాటరీల నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. లాటరీ జరుగుతున్న కేంద్రాలకు పెద్ద సంఖ్యలో మహిళా దరఖాస్తుదారులు వచ్చారు.

  • Loading...

More Telugu News