: ఇక ‘బ్లేడు బాబ్జీ’ల వంతు... విద్యార్థినిపై బ్లేడుతో దుండగుల దాడి


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సైకో ‘సూది’గాడి దాడులతో జనం బెంబేలెత్తిపోయారు. నాలుగైదు రోజులుగా ఈ తరహా దాడులు తగ్గుముఖం పట్టినా, నిన్న హైదరాబాదులోని కేపీహెచ్ బీలో మరో సిరంజీ దాడి చోటుచేసుకుంది. తాజాగా ‘బ్లేడు బాబ్జీ’లు రంగప్రవేశం చేశారు. రాజమండ్రి పరిధిలోని వీఆర్ పురంలో నేటి ఉదయం గుర్తు తెలియని దుండగులు పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థిపై దాడికి దిగారు. చేతిలో బ్లేడు పట్టుకుని దుండగులు చేసిన దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికపై దాడి అనంతరం దుండగులు సైకో సూదిగాడి తరహాలో క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. పరిస్థితిని గమనించిన స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News