: తెలంగాణకు మరో మూడు ఎమ్మెల్సీలు... 14కు పెరిగిన స్థానిక కోటా సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల కోటాలో మరో మూడు శాసన మండలి స్థానాలు పెరిగాయి. జనాభా ప్రాతిపదికన 3 స్ధానాలు పెంచేందుకు అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో మండలి స్థానాన్ని పెంచాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దాంతో ఈ సంఖ్య పెంపుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించి గెజిట్ విడుదల చేసింది. దాంతో తెలంగాణలోని 40 మండలి స్థానాలకు గాను ఇప్పటివరకు స్థానిక కోటాలో 11 స్థానాలున్నాయి. కొత్తగా మూడు పెంచడంతో ఆ కోటా 14కు చేరనుంది.