: కలాం జీవితం యువతకు స్ఫూర్తిదాయకం: బీజేపీ నేత లక్ష్మణ్


దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన జీవితమంతా యువతకు స్ఫూర్తి నిచ్చేందుకు ఎంతో కృషి చేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు కలాంకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కలాం గొప్ప మానవతావాదని కొనియాడారు. యువతకు దిశానిర్దేశం చేసిన కలాం మ్యాన్ ఆఫ్ మిసైల్ గా దేశ ప్రజల హృదయాలలో నిలిచిపోయారన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తుండిపోతాయన్నారు.

  • Loading...

More Telugu News