: అసహనం వ్యక్తం చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఫోటోలను ఇష్టం వచ్చినట్టు పెట్టడం ఎక్కువవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ కొత్త సినిమాలో నటిస్తున్నానంటూ, ఓ నకిలీ ఫేస్ బుక్ పేజ్ లో రాశారని చెప్పారు. ఇలాంటి నకిలీ అకౌంట్ల పట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చాలా మంది తనతో ఫోటోలు దిగుతుంటారని... ఆ తర్వాత ఆ ఫొటోలను దుర్వినియోగం చేస్తుంటారని సల్లూ భాయ్ ట్వీట్ చేశారు. ఇలాంటివి తనకు ఇష్టం ఉండదని చెప్పారు. తాను కాని, తన మేనేజర్లు కాని ఎలాంటి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.