: ఇంకెంతో కాలం భారత్ ను ప్రాధేయపడం... పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్


తమ దేశ జట్టుతో మ్యాచ్ లు ఆడమని టీమిండియాను తామేమీ ప్రాధేయపడటం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ఒకింత ఘాటుగా స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్ లో యూఏఈలో భారత్, పాక్ జట్ల మధ్య సిరీస్ ను తాము దాదాపుగా వదిలేసుకున్నామని కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ కు అంగీకరించమని ఇంకెంతో కాలం బీసీసీఐని తాము ప్రాధేయపడలేమని ఖాన్ పేర్కొన్నారు. బీసీసీఐ అనుమతితోనే ఈ సిరీస్ కు తేదీలు ఖరారయ్యాయని, ఆ తర్వాత తమ ప్రభుత్వం అనుమతిస్తేనే సిరీస్ ఆడతామని బీసీసీఐ మెలిక పెడుతోందని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. షహర్యార్ తాజా ప్రకటనలో యూఏఈ సిరీస్ దాదాపుగా రద్దైనట్లేనని చెప్పొచ్చు.

  • Loading...

More Telugu News