: ఓఎన్జీసీ పైపుల నుంచి లీకవుతున్న గ్యాస్... ఆందోళనలో ప్రజలు
తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం రేగింది. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం కేశవబాసుపాలెం సమీపంలోని ఓఎన్జీసీ పైపుల నుంచి రెండు రోజులుగా గ్యాస్ లీకవుతోంది. దీనిని గుర్తించిన అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై గ్రామస్థుల నుంచి రెండు రోజుల క్రితమే సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు మాత్రం స్పందించిన పాపాన పోలేదు. గ్యాస్ లీకేజీని నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో జనం వణికిపోతున్నారు.