: టి.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... కలాంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్


తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ దివంగత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం సంతాప తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ తో కలాంకు ఉన్న బంధం విడదీయలేనిదని చెప్పారు. నగరంలోని డీఆర్డీఎల్ కు కలాం పేరు పెట్టాలని అభిలషించారు. కలాం మరణం దేశానికి, దేశ రక్షణ రంగానికి తీరని లోటు అని అన్నారు. దేశానికి కలాం విశేష సేవలందించారని కొనియాడారు. అనుక్షణం దేశ ఉన్నతి కోసం అబ్దుల్ కలాం పరితపించారని అన్నారు. అంతకు ముందు కలాంకు సభలోని సభ్యులంతా సంతాపాన్ని ప్రకటించారు.

  • Loading...

More Telugu News