: సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ మెలిక!
ఆంధ్రప్రదేశ్ స్థానికతగా ఉండి, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఊరటనివ్వగా, ఏపీ సర్కారు కొత్త మెలిక పెట్టింది. వీరికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల్లో 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ చెల్లించాలని సుప్రీం ధర్మాసనం సూచించగా, ఈ తీర్పును సవాల్ చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. అసలు తమ ఉద్యోగులు కానివారికి తామెలా వేతనాలు చెల్లిస్తామని ఏపీ విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 58 శాతం వేతనాలు ఇవ్వాలంటే, తమపై రూ. 29 కోట్ల భారం పడుతుందని ట్రాన్స్ కో సీఎండీ విజయానంద్ వెల్లడించారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాకు కాకుండా పోయిన విద్యుత్ ఉద్యోగుల సంఖ్య 1,251 ఉండగా, వీరికి రూ. 40 కోట్ల మేరకు వేతనాలు రావాల్సివుంది. ఈ విషయంలో ఏం చేయాలన్న విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నట్టు విజయానంద్ పేర్కొన్నారు.