: రాజ్యాంగాన్ని కాదని ముందుకెళ్లి, కేంద్రాన్ని శరణు వేడుతున్న రాజస్థాన్


భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటకూడదు. కానీ, ఓటు బ్యాంకును కాపాడుకునే ఏకైక లక్ష్యంతో బీజేపీ పాలిత రాజస్థాన్ లో వసుంధరా రాజే ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను 68 శాతానికి పెంచింది. రాజస్థాన్ అసెంబ్లీ గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (స్పెషల్ బ్యాక్ వర్డ్ క్లాస్ - ఎస్బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం కోటాను ఇవ్వాలన్న బిల్లులను ఆమోదించింది. ఆపై న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చూసేందుకు కేంద్రాన్ని శరణు వేడుతోంది. ఈ రెండు బిల్లులనూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని, తద్వారా భవిష్యత్తులో తమ నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకుండా చూడాలని వసుంధరా రాజే సర్కారు మోదీని కోరుతోంది. ఇండియాలో రిజర్వేషన్లే వద్దు, ఈ విధానాన్ని సమీక్షించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్రాన్ని కోరిన మరుసటి రోజే రాజస్థాన్ ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయించడం గమనార్హం.

  • Loading...

More Telugu News