: ఫలక్ నూమా ఎక్స్ ప్రెస్ లో బాంబు... ఆర్పీఎఫ్ అప్రమత్తతతో తప్పిన ముప్పు


కోల్ కతాలోని హౌరా రైల్వే స్టేషన్ లో నేటి ఉదయం భారీ పేలుడు సంభవించేదే. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది. వివరాల్లోకెళితే... హౌరా స్టేషన్ లో ఫలక్ నూమా ఎక్స్ ప్రెస్ బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆర్పీఎఫ్ పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఓ సిలిండర్ ను గుర్తించారు. వెనువెంటనే దానిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అందులో బాంబు ఉన్నట్లు గుర్తించారు. ఆర్పీఎఫ్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న బాంబు డిస్పోజబుల్ స్వ్కాడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని సిలిండర్ ను నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అనంతరం బాంబును నిర్వీర్యం చేశారు.

  • Loading...

More Telugu News