: బొగ్గు కుంభకోణంలో తొలి ముద్దాయి సోనియానే...సరికొత్త ఆరోపణ చేసిన సోమిరెడ్డి


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సరికొత్త ఆరోపణ చేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను విచారించాలని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు చేసిన ఆరోపణలను సోమిరెడ్డి ఖండించారు. ఈ కుంభకోణంలో తొలి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీనేనని సోమిరెడ్డి ఆరోపించారు. యూపీఏ చైర్ పర్సన్ హోదాలో ఉన్న సోనియా గాంధీ, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలకు ఆమెనే బాధ్యత వహించాలని సోమిరెడ్డి వాదించారు.

  • Loading...

More Telugu News