: హంద్రీ నీవాకు గండి... నీట మునిగిన నందికొట్కూరు పొలాలు


హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఇంకా పూర్తే కాలేదు. అప్పుడే ఆ కాలువకు భారీ గండి పడింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు పరిధిలో ఈ కాలువకు నిన్న రాత్రి భారీ గండి పడింది. కొద్దిరోజులుగా కురిసిన వర్షాల కారణంగా ఈ కాలువలో భారీ స్థాయిలో నీరు నిల్వ ఉంది. అంతేకాక శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. దీంతో బ్యాక్ వాటర్ పోటెత్తడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా నిండిపోయింది. ఈ నేపథ్యంలో హంద్రీ కాలువకు పడిన గండి కారణంగా నందికొట్కూరు పరిధిలోని పంట పొలాలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న సాగు నీటి శాఖ అధికారులు గండిని పూడ్చే పనిని ప్రారంభించారు.

  • Loading...

More Telugu News