: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...రైతు ఆత్మహత్యలే ప్రధాన అజెండా!


తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే, దివంగత పీఏసీ చైర్మన్ పి.కిష్టారెడ్డిలకు నివాళి అర్పించనున్న శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడతాయి. సభ వాయిదా పడ్డ అనంతరం ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై చర్చించేందుకు సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) భేటీ జరగనుంది. సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పక్షం కూడా ఎన్ని రోజుల పాటు సభ నిర్వహించేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 30 వరకు సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కల్తీ కల్లు... తదితర అంశాలు ప్రస్తుత సమావేశాల్లో ప్రధాన అజెండాగా అధికార, విపక్షాలు సమావేశాలకు హాజరుకానున్నాయి.

  • Loading...

More Telugu News