: మరో మూడు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్ పీఎస్సీ


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) మూడు విభాగాలకు చెందిన ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. రవాణా శాఖలో 45 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులు, హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లైలో 115 అకౌంట్ అసిస్టెంట్ పోస్టులు, పురపాలక శాఖ టౌన్ ప్లానింగ్ విభాగంలో 123 సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నవంబర్ 8, వాటర్ సప్లై బోర్డులో అకౌంట్ అసిస్టెంట్ పోస్టులకు నవంబర్ 29న, టౌన్ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు నవంబర్ 22న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News