: మరోసారి గొప్పమనసు చాటుకున్న ఏంజెలీనా జోలీ


హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సామాజిక స్పృహ కలిగిన ఏంజెలీనా పలు సమస్యలపై మహిళల్లో అవగాహన కల్పించడం దగ్గర్నుంచి, సామాజిక సమస్యలపై అంతర్జాతీయ వేదికమీద ఆలోచనలు రేకెత్తించడం వరకు అలుపెరగని సేవ చేస్తూనే ఉంది. తాజాగా సిరియాని కుదిపేస్తున్న ఉగ్రవాదం కారణంగా వేల సంఖ్యలో శరణార్థులు దేశం దాటిపోతున్నారు. దీనిపై ప్రపంచం మొత్తం స్పందించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సిరియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఏంజెలీనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు అనాధలుగా మారడంపై ఆవేదన చెందింది. దీంతో వారిలో ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. కాగా, ఏంజెలీనా ఆఫ్రికాదేశాలకు చెందిన ముగ్గురు పిల్లలను ఇప్పటికే దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఏంజెలీనా మరో ముగ్గురు పిల్లలకు తల్లి. తాజాగా దత్తత తీసుకున్న బాలుడితో కలిసి ఏంజెలీనా కుటుంబంలో ఏడుగురు పిల్లలున్నారు.

  • Loading...

More Telugu News