: ప్రేమ గురించి మాత్రం చెప్పనంటున్న సోనమ్ కపూర్


మీడియాలో తనకు సంబంధించిన విషయాలు పంచుకునేందుకు అభ్యంతరం లేదని, అయితే ప్రేమకు సంబంధించిన విషయాలు మాత్రం అస్సలు పంచుకోనని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోనమ్ మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ విషయాలు ఏవరడిగినా చెబుతానని చెప్పింది. అయితే తన కెరీర్ ను ప్రభావితం చేసే ప్రేమ వ్యవహారంపై మాట్లాడడం మాత్రం ఇష్టం లేదని తెలిపింది. ప్రేమ వ్యక్తిగతమైన విషయమని తాను నమ్ముతానని పేర్కొంది. దాని గురించి అడగవద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. నీరజ, ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాల్లో నటిస్తున్నానని సోనమ్ తెలిపింది.

  • Loading...

More Telugu News