: డేటింగ్ కోసం స్పెషల్ కోర్సు


చైనా రాజధాని బీజింగ్ లో తియాంజిన్ యూనివర్సిటీ 'డేటింగ్'లో ప్రత్యేకమైన కోర్సును ప్రవేశపెట్టింది. డేటింగ్ తో బాటుగా 'మేకింగ్ ఫ్రెండ్స్' అనే కోర్సు కూడా వుంది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయని వారు వెల్లడించారు. ఈ కోర్సులో 32 గంటల పాటు క్లాసులు ఉంటాయి. కోర్సు అన్నాక పరీక్షలు కూడా సాధారణం, అందుకే రెండు క్రెడిట్లు రూపొందించారు. ఈ రెంటిలో పాస్ అయితే డేటింగ్ కు అర్హత సాధించినట్టే. అబ్బాయిలు, అమ్మాయిల్లో ఎక్కువ ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారికి ఎక్కువ మార్కులు వస్తాయని కోర్సు డైరెక్టర్ కాంగ్ ఇంగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News