: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా
బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆసుపత్రిలో చేరారు. ఎలర్జీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సన్నిహితులు తెలిపారు. ఐఐటీ కాన్పూర్ లో జరుగుతున్న యాక్టింగ్ వర్క్ షాప్ లో ఇవాళ షా పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో శ్వాస పీల్చుకోవడంలో కష్టంగా ఉండటంతో వెంటనే అక్కడి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అయితే ఎలర్జీ, శ్వాస సమస్యలకు షాకు మెడిసన్ ఇచ్చారని, కోలుకున్న తరువాత డిశ్చార్జ్ చేశారని తెలిసింది. అక్కడి నుంచి విశ్రాంతి తీసుకునేందుకు షాను ఐఐటీ గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లారు.