: 'భజరంగీ భాయ్ జాన్' కథకు స్ఫూర్తిదాతను చితకబాదిన పాక్ పోలీసులు
చాంద్ నవాబ్... ప్రఖ్యాత పాత్రికేయుడు, సల్మాన్ ఖాన్ సినిమా 'భజరంగీ భాయ్ జాన్' సినిమాకు స్ఫూర్తిదాత. పాకిస్థాన్ లోని '92 న్యూస్ ఛానల్'కు ఆయన విలేకరిగా పని చేస్తున్నారు. కరాచీలోని రైల్వే స్టేషన్ వద్ద టికెట్ల అమ్మకాల్లో అవినీతిని ఎత్తి చూపేందుకు చాంద్ నవాబ్ ప్రయత్నిస్తుండగా... రైల్వే పోలీసులు ఆయనపై దాడి చేశారు. విచక్షణ మరిచి చితకబాదారు. ఈ ఘటనపై పాక్ లోని పాత్రికేయులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.