: స్నేహధర్మం నిర్వర్తించేందుకు మతం అడ్డురాలేదు
ఒక మతానికి చెందిన వారు ఇంకో మత సంప్రదాయాన్ని ఆచరించాలంటే కొంత సంశయిస్తారు. అయితే అలాంటి సంశయాలను పక్కనపెట్టి స్నేహధర్మం పాటించాడో వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు దగ్గర్లోని బైతుల్ జిల్లాలో సంతోష్ సింగ్ అనే కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు తప్ప బంధువులెవరూ లేరు. అతనికి రిక్షావాలా అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి స్నేహితుడు. సంతోష్ మృతితో అతని కుటుంబం దిక్కులేనిదైపోయింది. ఈ పరిస్థితికి చలించిపోయిన రజాక్ స్నేహితుడికి అతని మత సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వర్తించాడు. తమ స్నేహం కులం,మతం ప్రాతిపదికన ఏర్పడలేదని, ఓ స్నేహితుడు ఏం చేయాలో తాను కూడా అదే చేశానని సంతోష్ సింగ్ చెప్పాడు.