: హాలీవుడ్ దర్శకుడి తండ్రి, సోదరుడు కిడ్నాప్, హత్య


ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలెజాండ్రో గోమెజ్ తండ్రి, సోదరుడుని మెక్సికో కిడ్నాపర్లు అపహరించారు. అండర్ వరల్డ్ కు కేంద్రంలా భాసిల్లే మెక్సికోలో కిడ్నాపర్లు ఈ నెల 4న వారిద్దరినీ అపహరించి, డబ్బులు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు అడిగినంత సొమ్ము ముట్టజెప్పినప్పటికీ వారిని విడిచిపెట్టలేదు. దీంతో కుటుంబ సభ్యలు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా, వారి మృతదేహాలను వెరాక్రూజ్ స్టేట్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. డబ్బిచ్చినా వారిని హత్య చేశారని చెబుతూ అలెజాండ్రో గోమెజ్ ఆవేదన చెందారు.

  • Loading...

More Telugu News