: జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం: షబ్బీర్ అలీ
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయరంగ సమస్యలపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులందరికీ ఎక్స్ గ్రేషియాను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడతామని, వారి కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని చెప్పారు.