: ఐశ్వర్య సినిమా కొత్త పోస్టర్ విడుదల
ఐదేళ్ల విరామం తర్వాత అందాల ఐశ్వర్యరాయ్ సినిమా ప్రేక్షల ముందుకు వస్తోంది. ఐశ్వర్య, ఇర్ఫాన్ ఖాన్, షబానా ఆజ్మి ప్రధాన పాత్రలు పోషించిన 'జజ్బా' అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాకు సంజయ్ గుప్తా దర్శకత్వం వహించారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐశ్వర్య, ఇప్పుడు తన కుమార్తె కొంచెం పెద్దది కావడంతో, చాలా విరామం తర్వాత ఈ 'జజ్బా' సినిమాలో నటించింది.