: పదకొండేళ్ల తర్వాత కోమాలోంచి లేచి ఫెదరర్ గురించి అడిగిన అభిమాని!
రోజర్ ఫెదరర్ ఆటతీరుకు అభిమానులు ఎంతగా పులకించిపోతారో తెలిపే ఘటన స్విట్జర్లాండ్ లో చోటుచేసుకుంది. 2004లో రోజర్ ఫెదరర్ ఏటీపీ ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచాడు. ఫెదరర్ వీరాభిమాని అపారిసియో అదే సంవత్సరం డిసెంబర్ 12న కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. పదకొండేళ్లు కోమాలో ఉన్న అపారిసియో ఈమధ్యే కోలుకున్నాడు. స్పృహలోకి వస్తూనే ఫెదరర్ రిటైర్ అయ్యాడా? అని ప్రశ్నించాడు. లేదు వరల్డ్ నెంబర్ టూగా కొనసాగుతున్నాడని చెప్పగానే, ఫెదరర్ అద్భుతమైన ఆటగాడని తనకు తెలుసని, అతని సహచరులు ఆండ్రీ అగాసీ, మారట్ సఫిన్, టిమ్ హెన్ మన్ లాంటి టాప్ టెన్ ర్యాంకర్లు రిటైరైపోయినా, ఫెదరర్ టాప్ గానే ఉంటాడని సంబరపడిపోయాడు. ఫెదరర్ 17 గ్రాండ్ స్లామ్ లు గెలుచుకున్నాడని తెలుసుకుని ఉప్పొంగిపోయాడు.