: లింగమార్పిడి బిల్లు పార్లమెంట్ ముందుకు... ఆమోదం పొందితే సదుపాయాలివే!


ఇండియాలో లింగమార్పిడి చేయించుకున్న వారి హక్కులను కాపాడే నిమిత్తం రూపొందించిన 'ట్రాన్స్ జండర్ పర్సన్స్ బిల్' తొలిసారిగా పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లింగమార్పిడి చేయించుకున్న వారిని, హిజ్రాలను అధికారికంగా గుర్తించడంతో పాటు వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఈ బిల్లును మోదీ సర్కారు రూపొందించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే, ట్రాన్స్ జండర్లు వెనుకబడిన తరగతుల వర్గాల్లోకి చేరుతారు. బీసీ కోటా ప్రకారం వీరికి అన్ని రిజర్వేషన్లూ వర్తిస్తాయి. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీ ట్రాన్స్ జండర్ల లెక్కలను తేల్చింది. ఈ కమిటీలో సర్టిఫైడ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. లింగమార్పిడి చేయించుకున్న వారికి సంఘంలో గౌరవం లభించడం లేదన్న నేపథ్యంలో వారిని సాంఘిక సంక్షేమ పథకాల్లో భాగం చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 6 లక్షల మంది వరకూ ట్రాన్స్ జండర్లు ఉన్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News