: పేరుకు ఘనం, వేతనాల్లో ఘోరం... భారత ఐటీ పరిశ్రమ తీరు!


భారత ఐటీ పరిశ్రమ... ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఎంతో పేరు తెచ్చుకుంది. అయితేనేం, వేతనాల విషయంలో మాత్రం ఘోరంగా ఉంది. ఐటీ విభాగంలో అత్యంత తక్కువ వేతనాలిస్తున్న 10 దేశాల్లో ఇండియా కూడా ఒకటి. స్విట్జర్లాండ్ ఐటీ కంపెనీలతో పోలిస్తే కేవలం 25 శాతం మాత్రమే ఇండియాలో ఉద్యోగుల జేబుల్లోకి చేరుతోంది. రిక్రూట్ మెంట్ సంస్థ మై హైరింగ్ క్లబ్ డాట్ కాం, ప్రపంచవ్యాప్తంగా ఐటీ వేతనాలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇండియాలో ఐటీ ఉన్నతోద్యోగి సగటు వార్షిక వేతనం 41,213 డాలర్లు (సుమారు రూ. 27.09 లక్షలు) కాగా, స్విట్జర్లాండ్ లో 1,71,465 డాలర్లు (సుమారు రూ. 1.12 కోట్లు)గా ఉంది. రెండో స్థానంలో ఉన్న బెల్జియంలో 1.52 లక్షల డాలర్ల వేతనం లభిస్తుండగా, 1.38 లక్షల డాలర్లతో డెన్మార్క్, 1.32 లక్షల డాలర్లతో అమెరికా, 1.29 లక్షల డాలర్లతో బ్రిటన్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఇక ఇండియా కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్న దేశాల్లో బల్గేరియా, వియత్నాం, థాయ్ లాండ్, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు మాత్రమే ఉన్నాయని మై హైరింగ్ క్లబ్ డాట్ కాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News