: టి.శాసనసభ సమావేశాల్లో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ పై చర్చ లేనట్టే!


తెలంగాణలో అధికారపక్షమైన టీఆర్ఎస్ కు ప్రతిపక్షం కాంగ్రెస్ కన్నా, టీడీపీతోనే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో, రేపట్నుంచి మొదలయ్యే టి.అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్, టీడీపీల మధ్య వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఓటుకు నోటు కేసు టీడీపీని, ఫోన్ ట్యాపింగ్ అంశం టీఆర్ఎస్ ను తీవ్రంగా ఇరుకునబెట్టాయి. ఈ క్రమంలో, ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చ ఇరు పార్టీలకు ఇబ్బందికరమే. అందువల్ల వీటిపై చర్చ దాదాపు జరగకపోయే అవకాశాలే ఎక్కవ ఉన్నట్టు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే, సమావేశాల తొలి నాలుగు రోజుల్లో చర్చకు గాను మొత్తం 150 ప్రశ్నల్లో 40 ప్రశ్నలను ఫైనలైజ్ చేశారు. వీటిలో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు లేకపోవడం గమనార్హం. దీనిపై బీజేపీ సభాపక్ష నేత లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ స్పందిస్తూ... ప్రశ్నల్లో ఈ రెండు అంశాలు ఎందుకు లేవన్న కారణం తమకు తెలియదని, బహుశా ఈ అంశాలను అందరూ మరిచిపోయినట్టు ఉన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News