: కల్తీ కల్లు దొరకలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు!


తెలంగాణలో కల్తీ కల్లు మరణమృదంగం మోగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మత్తు మందు కలిపిన కల్తీ కల్లుకు లక్షలాది మంది బానిసలయ్యారు. ఈ క్రమంలో, కల్తీ కల్లు తాగి మరణించే వారు కొందరైతే, కల్తీ కల్లు దొరక్క పిచ్చెక్కిపోతున్న వారు మరికొందరు. పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందంటే... కల్తీ కల్లు దొరక్క ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. మత్తుమందు కలిపిన కల్లు దొరక్క పోవడంతో మెదక్ జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లిలో రాములు (52) అనే వ్యక్తి చనిపోయాడు. మరోవైపు, సదాశివపేట మండలం నందికంటిలో కల్తీ కల్లు దొరక్క ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మొయినుద్దీన్ అనే రిక్షా కార్మికుడు... మహబూబ్ నగర్ జిల్లా హాజీపల్లిలో ఓ మహిళ కూడా మృతి చెందారు.

  • Loading...

More Telugu News