: కరవు తీరేలా వేల టన్నుల్లో ఉల్లి, కందిపప్పు, మినప్పప్పు వస్తున్నాయ్!


నిత్యావసర వస్తువుల కొరత తీరనుంది. అక్టోబర్ 20 నాటికి వేల టన్నుల ఉల్లిపాయలు, కందిపప్పు, మినపప్పు దేశంలోని వివిధ నౌకాశ్రయాలకు దిగుమతి కానున్నాయి. తొలి బ్యాచ్ ఉల్లిపాయలు మరో రెండు రోజుల్లో రానున్నాయని క్యాబినెట్ సాధికార కమిటీ ప్రకటించింది. దీర్ఘకాల అవసరాల మేరకు పప్పుధాన్యాలను భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నట్టు అధికారిక ప్రకటనను కమిటీ వెలువరించింది. తొలి బ్యాచ్ లో చెన్నై పోర్టుకు 888 టన్నుల ఉల్లిపాయలు, 984 టన్నుల కందిపప్పు రేపు, ఎల్లుండిలో రానున్నాయి. ఆపై అక్టోబర్ 20లోగా విడతల వారీగా 5 వేల టన్నుల ఉల్లిపాయలు వస్తాయి. 2,500 టన్నుల మినప్పప్పు చెన్నై, జాంనగర్ పోర్టులకు రానుంది. అక్టోబర్ తొలివారంలో 1000 టన్నులు, రెండో వారంలో మరో 1000 టన్నుల ఉల్లిపాయలు దిగుమతి కానున్నాయి. గత కొంతకాలంగా పప్పుధాన్యాలు, ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకగా, కేంద్రం దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ఇండియాకు మరింతగా ఎగుమతి చేసేందుకు మూడవ విడత ఉల్లిపాయల టెండర్లను అంతర్జాతీయ స్థాయిలో కేంద్రం ఇప్పటికే ఆహ్వానించింది. వీటిని నేడు ఖరారు చేయనున్నారు.

  • Loading...

More Telugu News