: సింగపూర్ నుంచి నేరుగా నేడు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ఈ రోజుతో ముగియనుంది. తరువాత అక్కడ బయలుదేరి రాత్రికి నేరుగా ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు 'నీతి ఆయోగ్'లో స్వచ్ఛ భారత్ పై జరిగే ముఖ్యమంత్రుల సబ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వచ్ఛ భారత్ పథకంలో మార్పులు, చేర్పులు, ఇతర సిఫారసులతో కూడిన నివేదికపై చంద్రబాబు కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, రాధామోహన్ లతో బాబు భేటీ అవుతారు. రాష్ట్రానికి చెందిన పలు పెండింగ్ అంశాలపై చర్చిస్తారు.