: చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించిన సింగపూర్ ప్రధాని


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ, స్వల్ప కాలంలోనే అద్భుతమైన పనితీరును కనబరిచారని కొనియాడారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమిని సేకరించడం చాలా గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నారని కితాబిచ్చారు. పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో ఏపీని రెండో స్థానంలో నిలిపినందుకు చంద్రబాబును అభినందించారు. ఏపీకి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందించడానికి సింగపూర్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News