: గుంటూరు ఆసుపత్రిలో మళ్లీ పాము... కలెక్టర్ అత్యవసర సమావేశం
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు, పాములు హల్ చల్ చేస్తున్నాయి. నిన్న ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లోకి మళ్లీ పాము చొరబడింది. దీంతో, ఆ పామును చంపి, గుట్టు చప్పుడు కాకుండా కాల్చేశారు ఆసుపత్రి సిబ్బంది. చివరకు ఈ విషయం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు తెలియడంతో, ఈ రోజు ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 52 శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమస్యాత్మకంగా మారిన పాములు, ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతున్నారు. అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసుపత్రిని పరిశీలించే అవకాశం ఉండటంతో, జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై పూర్తిగా దృష్టిని సారించారు.