: 1200 మంది విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
ఏపీ స్థానికత ఆధారంగా తొలగించిన 1200 మంది విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు వారిని తొలగిస్తూ తెలంగాణ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని తెలిపింది. తుది తీర్పు వచ్చే వరకు ఉద్యోగులు తెలంగాణ ట్రాన్స్ కోకే చెందుతారని కోర్టు ఆదేశించింది. పెండింగ్ లో ఉన్న వారి జీతాలను 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ రాష్ట్రాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లో వేతన బకాయిలు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల కిందట తమను హఠాత్తుగా తొలగించి, అప్పటి నుంచీ జీతాలు చెల్లించడం లేదంటూ విద్యుత్ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు పైవిధంగా ఆదేశాలు ఇచ్చింది.