: విజయవాడలో వినాయక విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టులో పిటిషన్
విజయవాడలో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వినాయక నిమజ్జనాలను అనుమతించవద్దంటూ అశోక్ అనే అడ్వకేట్ పిటిషన్ వేశారు. నిమజ్జనాల వల్ల తాగునీరు కలుషితమవుతుందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు పిటిషన్ ను పరిశీలించిన కోర్టు విజయవాడ నగర మున్సిపల్, పోలీస్ కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు వారు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం కావడంతో ఏపీలో ఈసారి ఎక్కువ మొత్తంలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు.