: 21వ శతాబ్దంలోనూ రిజర్వేషన్లు ఇవ్వడమేంటి?: కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ


21వ శతాబ్దంలోనూ రిజర్వేషన్లు ఇవ్వడంలో అర్థమేమిటని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ప్రశ్నిస్తున్నారు. అంతగా అవసరమనుకుంటే కులం ప్రాతిపదికగా కాకుండా ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వాలని మనీశ్ సూచిస్తున్నారు. కొంతమంది ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందంటూ ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రికలు 'ఆర్గనైజర్', 'పాంచజన్య'లకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనీశ్ పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News