: సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మోదీ సర్కారు!


నెటిజన్ల విమర్శలకు మోదీ సర్కారు దిగొచ్చింది. ప్రతిపాదిత ఎన్ క్రిప్టెడ్ చట్టం పరిధి నుంచి వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలకు మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది. మొబైల్ మాధ్యమంగా జరిగే సమాచార బట్వాడాకు సంబంధించిన అన్ని టెక్ట్స్ మెసేజ్ లను 90 రోజుల పాటు కచ్ఛితంగా నిల్వ ఉంచుకోవాలని, నిఘా వర్గాలు, విచారణ సంఘాలు అడిగితే, వాటిని పంచుకోవాలని, అట్లా చేయకుంటే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిన్న కేంద్రం ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రైవేటు మెసేజ్ లపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో జాతీయ ఎన్ క్రిప్షన్ విధానాన్ని సవరిస్తూ, ఆగమేఘాల మీద క్లారిఫికేషన్ ను ఈ ఉదయం ఆన్ లైన్లో కేంద్ర ప్రభుత్వం పోస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాలకు ఈ నూతన విధానం వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వాడుతున్న వారిపై పెత్తనం చేయడం తమ ఉద్దేశం కాదని, జాతీయ భద్రతాంశాలు ముడిపడివున్న చోట మరింత నిఘా కోసమే ఈ ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News