: ట్రాన్స్ కో అధికారి ఇంట్లో అరకిలో బంగారం...రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులు


తెలంగాణ ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. తెలంగాణ ట్రాన్స్ కోలో డీఈగా పనిచేస్తున్న శ్రీధర్ అనే అధికారి ఇంటిపై నేటి తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ డీఈగా పనిచేస్తున్న శ్రీధర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడన్న విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ దాడి చేసింది. ప్రస్తుతం హైదరాబాదులోని శ్రీధర్ ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటిదాకా శ్రీధర్ ఇంటిలో రూ.5 కోట్ల మేర అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. హైదరాబాదు పరిధిలోనే కాక కరీంనగర్ జిల్లాల్లోనూ శ్రీధర్ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం హైదరాబాదులో పెద్ద సంఖ్యలో నివాస స్థలాలను కొనుగోలు చేశాడు. ఇక శ్రీధర్ ఇంటిలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News