: ‘స్టెల్లా’ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పసుపు రంగులో యువకుల పేర్లూ, ఫోన్ నెంబర్లు
విజయవాడలో పేరొందిన కళాశాల ‘స్టెల్లా మేరీ’లో నిన్న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని భానుప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. కళాశాల హాస్టల్ గదిలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, బాధితురాలి తల్లిదండ్రులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తంగిడిగూడెం గ్రామానికి చెందిన భానుప్రీతి, నిన్న మధ్యాహ్నం కళాశాల మెస్ లో భోజనం చేసిన తర్వాత తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీల్లో అక్కడక్కడా పసుపు పూసిన పేపర్ వారికి కనిపించింది. ఈ పేపర్ లో నలుగురు యువకుల పేర్లతో పాటు వారి సెల్ ఫోన్ నెంబర్లు రాసి ఉన్నాయి. ఆమె మృతికి, పేపర్ లో పేర్లున్న యువకులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.