: హైదరాబాదులో నడిరోడ్డుపై మరో దారుణ హత్య... ఫైనాన్స్ వ్యాపారిని కత్తులతో నరికేసిన దుండగులు
హైదరాబాదు నగరంలో వరుస హత్యలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న రాత్రి నగరం నడిబొడ్డున ఉన్న రాంకోఠిలో సెకండ్ హ్యాండ్ బైకుల వ్యాపారిని అతడి ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. అదే తరహాలో నిన్న రాత్రి బోరబండలోనూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న సోమసుందర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన కూడా రాత్రి నడిరోడ్డుపైనే చోటుచేసుకోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.