: జాతీయ షూటర్ సిద్దూ దారుణ హత్య


జాతీయ స్థాయి షూటర్ సిద్దూ (34) దారుణ హత్యకు గురయ్యాడు. 2001 నేషనల్ గేమ్స్ లో టీమ్ ఈ వెంట్ లో అభినవ్ బింద్రాతో కలిసి సిద్దూ స్వర్ణపతకం సాధించాడు. ఛండీగఢ్ లోని ఓ పార్క్ లో ఓ మృతదేహం పడి ఉందని పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెళ్లి చూసిన పోలీసులు, అది ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు సిద్దూదిగా గుర్తించారు. అతని శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్టు గుర్తించారు. ఉన్నత కుటుంబానికి చెందిన సిద్దూ న్యాయవాదిగా, స్పోర్ట్స్ ప్రమోటర్ గా పని చేస్తున్నారు. 15 ఏళ్లుగా షూటింగ్ లో రాణించి పలు పతకాలు సాధించారు. కాగా, సిద్దూ హత్యకు కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. సిద్దూ హత్యపై షూటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు షూటర్లు సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News