: జగ్ మోహన్ దాల్మియాకు అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు


బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా అంత్యక్రియలు పూర్తయ్యాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్ కతాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేసింది. దాల్మియా అంత్యక్రియలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీసీసీఐ మాజీ అధ్యక్షులు శరద్ పవార్, శ్రీనివాసన్, బీసీసీఐ ప్రముఖులు, క్రికెట్ ప్రముఖులు, సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు. దాల్మియా కుమారుడు అభిషేక్ దాల్మియా అంతిమ సంస్కారం నిర్వహించగా, దాల్మియా భార్య చంద్రలేఖ, కుమార్తె వైశాలి అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు రెండు గంటలపాటు ఈడెన్ గార్డెన్స్ లో ప్రజల సందర్శనార్థం దాల్మియా మృతదేహాన్ని ఉంచారు. 75 ఏళ్ల దాల్మియా గుండెపోటుతో మృతిచెందగా, ఆయన కళ్లను వన్ముక్త్ నేత్రాలయకు దానం చేశారు.

  • Loading...

More Telugu News