: కొంతమంది మరణించాక స్పందిస్తారా?: 'జీవీఎంసీ' మండిపడిన హైకోర్టు


జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్) అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంత మంది మరణించేంత వరకు వేచిచూస్తారా? అని మండిపడింది. విశాఖపట్టణంలో ఆహర కల్తీపై ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారించిన న్యాయస్థానం, అధికారుల తీరును తప్పుపట్టింది. ఆహారం కల్తీ అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. సంబంధిత వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ తరపున వాదన వినిపిచిన న్యాయవాది తాము తనిఖీ చేసిన 41 నమూనాలను ప్రయోగశాలకు పంపగా, అందులో సగానికిపైగా తినడానికి యోగ్యమైనవి కాదని తేలిందని పేర్కొన్నారు. అలాంటప్పుడు వ్యాపారుల లైసెన్స్ ఎందుకు రద్దు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News