: అసెంబ్లీ టికెట్ కోసం అభ్యర్థి ఏడుపు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు టికెట్ ఇవ్వలేదంటూ పిల్లలు ఏడ్చినట్లు ఏడ్చేశాడు ఓ అభ్యర్థి. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)కి చెందిన అశోక్ గుప్తా తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని, లేకుంటే ఊరుకోనంటూ ఏడిచాడు. పాట్నాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోకి దూసుకొచ్చాడు. ఇటీవల జరిగిన పార్టీ ర్యాలీ కోసం రూ.50,000 ఖర్చు చేశానని, తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో అక్కడున్న వారు అతడిని బయటకు లాక్కెళ్లారు. మీడియా అంతా అక్కడే ఉండటంతో ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు.