: అసదుద్దీన్ విన్నపానికి ఓకే చెప్పిన కేసీఆర్


నవంబర్ 21వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో అఖిల భారత ముస్లిం సమ్మేళన కార్యక్రమం జరగనుంది. మొత్తం మూడు రోజు పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ రోజు కలిశారు. ముస్లిం సమ్మేళన కార్యక్రమానికి సహకరించాలని ఈ సందర్భంగా అసద్ విన్నవించారు. దీనిపై స్పందించిన కేసీఆర్... సమ్మేళనానికి అవసరమైన మంచినీరు, విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News