: తెలంగాణలో బక్రీద్ సెలవు మారింది...సెలవు 24న కాదు


ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ సెలవులో మార్పులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అధికారిక పండగ సెలవు క్యాలెండర్ లో బక్రీద్ సెలవును సెప్టెంబర్ 24గా పేర్కొంది. దీనిని మార్పు చేస్తూ నేడు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ సందర్భంగా సెప్టెంబర్ 25న అధికారిక సెలవు దినంగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 25న ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News