: ఓటుకు నోటు కేసు... ఎమ్మెల్యే సండ్ర బెయిల్ షరతులను సడలించిన హైకోర్టు
ఓటుకు నోటు కేసులో నిందితుడు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ షరతులను ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు సడలించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, సమావేశాలు జరిగినంత కాలం హైదరాబాదులో ఉండటానికి అనుమతించింది. సమావేశాలు ముగిసిన అనంతరం హైదరాబాదులో ఉండరాదని... ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండొచ్చని హైకోర్టు తెలిపింది. తన బెయిల్ షరతులను సడలించాలంటూ సండ్ర వెంకట వీరయ్య ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు.