: తెలంగాణపై నివేదిక ఇవ్వలేదు: గవర్నర్ నరసింహన్
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి తాను ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకే ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తానని తెలిపారు.